అమరావతి : శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన పలువురికి గాయాలయ్యాయి. జిల్లాలోని రామగిరి మండలం పెనుబోలు గ్రామ జాతీయ రహదారిపై ఆడి ఉన్న బొలెరో వాహనాన్ని కంటైనర్ లారీ ఢీ కొంది. దీంతో బొలెరోలో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కొలిమిగుండ్లవాసులుగా వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.