Boat Capsized | ఏపీ నంద్యాల అవుకు జలశయంలో పడవ ప్రమాదం చోటు చేసుకున్నది. పర్యాటక శాఖకు చెందిన పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. 12 మంది పర్యాటకులతో పడవ జలాశయంలోకి వెళ్లిన సమయంలో.. ఒక్కసారిగా నీరు లోపలికి రావడంతో పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తొమ్మిది మందిని రక్షించారు.
ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. అయితే, ఆశాబీ (28) అనే మహిళను ఒడ్డుకు తీసుకువచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురిని దగ్గరలో ఉన్న బనగాపల్లి దవాఖానాకు తరలించగా.. నూర్జహాన్ (37) అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. నదిలో షాజీదా అనే యువతి గల్లంతు కాగా.. ఆచూకీ కోసం గాలిస్తున్నారు.