Kuppam | చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం ఉదయం క్షుద్రపూజలు కలకలం రేపాయి. ప్యాలెస్ రోడ్డులోని ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. నడిరోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లతో పాటు.. దాని చుట్టూ రక్తపు మరకలు ఉండటంతో జంతు బలి ఇచ్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుప్పంలో క్షుద్ర పూజలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.