‘తిరుపతి’లో మూడో స్థానానికే పరిమితమైన బీజేపీ
బీజేపీ| ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండగా, జనసేనతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ మూడో స్థానానికే పరిమితమయింది.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుండగా, జనసేనతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ మూడో స్థానానికే పరిమితమయింది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 86,758 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 2,04,370 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,17,612 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 20,811 ఓట్లు పోలయ్యాయి.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 2500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది.
కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నందిగ్రామ్‌లో ఆధిక్యంలోకి వచ్చిన మమతా బెనర్జీ
భవానిపూర్‌లో టీఎంసీ అభ్యర్థి ఆధిక్యం
చెన్నై నగరంపై పట్టు నిలుపుకున్న డీఎంకే
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రవి శంకర్
అందరి దృష్టి నందిగ్రామ్‌పైనే..
బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా!
ఎంపీ ఉప ఎన్నిక : దమోహాలో కాంగ్రెస్ ముందంజ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

