New Bar Policy | ఏపీలో మందుబాబులకు గుడ్న్యూస్.. ఇవాల్టి నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పాలసీ 2008 వరకు మూడేళ్ల కాలం అమలులో ఉండనుంది.
గతంలో ఉన్న బార్ పాలసీ ప్రకారం.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటలకు బార్లను తెరిచి ఉంచాల్సి ఉంటుంది. కానీ నూతన విధానం ద్వారా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లను తెరిచి ఉంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్ పాలసీని అమలు చేస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ ఉత్తర్వుల్లో భాగంగా 10 శాతం మద్యం షాపులను కల్లు గీత కులాలకు కేటాయించిన సంగతి తెలిసిందే.