తిరుమల : ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై ఇవాళ నిర్వహించిన పదో విడత బాలకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా సాగింది. ఇందులో 45 నుంచి 49 సర్గల వరకు గల 133 శ్లోకాలను పారాయణం చేశారు. అహల్యకృత శ్రీరామ స్తోత్రం 23 శ్లోకాలు, యోగవాసిష్టం – ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాలు పారాయణం చేశారు.
వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజి, ధర్మగిరి వేద పాఠశాల పండితులు కె.రామానుజాచార్యులు, పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయణం చేశారు.