
తిరుమల : కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి12వ తేదీ ఐదవ విడత అఖండ బాలకాండ పారాయణం నిర్వహించనున్నది టీటీడీ. ఇందులోభాగంగా బాలకాండలోని 18 నుంచి21 సర్గల వరకు130 శ్లోకాలను పారాయణం చేస్తారు.
ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.