అమరావతి : త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఏపీ సీఎం(AP CM) చంద్రబాబు నాయుడు (Chandra Babu) పిలుపునిచ్చారు. సోమవారం బక్రీదు పండుగ సందర్భంగా ముస్లింలకు చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ (Bakrid ) ఉద్దేశమని వారన్నారు. స్వార్థం, రాగద్వేషాలు వదిలిపెట్టి త్యాగగుణం పెరగాలని అన్నారు. పండుగ సందర్భంగా పేదలకు ఆహార వితరణ చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలందరూ సమైక్యత, సమానత్వం దిశగా అడుగులు వేయాలని, ఇస్లాంలో త్యాగం, దానగుణాలకు ప్రత్యేకమైన స్థానముందని వెల్లడించారు.