Tirumala | భక్తులను భక్తిసాగరంలో నింపిన అయోధ్యకాండ అఖండ పారాయణం
Tirumala | లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల(Tirumala) లోని నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం నిర్వహించిన 6వ విడత అయోధ్యకాండ(Ayodhyakanda) అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది.
తిరుమల : లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల(Tirumala) లోని నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం నిర్వహించిన 6వ విడత అయోధ్యకాండ(Ayodhyakanda) అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. దాదాపు రెండు గంటల పాటు అయోధ్యకాండలోని 18 నుంచి 21వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 199 శ్లోకాలను వేదపండితులు పారాయణం చేశారు.

యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 224 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు డాక్టర్ కె.రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, డాక్టర్ మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల(Dharmagiri Veda patasala, ), ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థకు చెందిన వేదపారాయణదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు(Annamacharya Project) కళాకారులు శ్రీనివాస్ బృందం ‘రామా సీతారామా’ అనే రామదాసు కీర్తనను, ‘రాముని భజన సేయవే మనసా’ అనే నామ సంకీర్తనను రసరమ్యంగా ఆలపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

