Tirumala | అయోధ్యకాండ అఖండ పారాయణంతో మార్మోగిన తిరుమలగిరులు
Tirumala | లోక కల్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం నిర్వహించిన 7వ విడత అయోధ్యా కాండ అఖండ పారాయణం తో తిరుమలగిరులు మార్మోగాయి.
తిరుమల : లోక కల్యాణార్థం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల (Tirumala) నాదనీరాజనం వేదికపై ఆదివారం నిర్వహించిన 7వ విడత అయోధ్యా కాండ అఖండ పారాయణం( Ayodhyakanda Akhanda Parayanam) తో తిరుమలగిరులు మార్మోగాయి. ఇందులో 22 నుంచి 25వ సర్గల వరకు గల 155 శ్లోకాలను పండితులు పారాయణం చేశారు. యోగవాసిష్టం, ధన్వంతరి మహామంత్రం 25 శ్లోకాల పారాయణతో భక్తులు భక్తిభావంతో పులకరించిపోయారు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠానికి చెందిన పండితులు (Scholars) శేషాచార్యులు, అనంత, మారుతి శ్లోక పారాయణం చేశారు.

అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాదుకు చెందిన నాగరాజు బృందం రామనామ సంకీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రఘునాథ్ బృందం ‘ పాహిరామ ప్రభో, పాహిరామ ప్రభో’ సంకీర్తనను ఆలపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

