అమరావతి : మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారణ రేపటికి (26వ తేదీ)వాయిదా వేసింది . సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) వెకేషన్ బెంచ్ గురువారం ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను చేపట్టింది.
ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి వాదనలకు ఇంకెంత సమయం పడుతుందని ప్రశ్నించారు. గంటల సమయం పడుతుందని పేర్కొనడంతో విచారణను శుక్రవారం ఉదయం 10 .30 గంటలకు తిరిగి ప్రారంభిస్తామంటూ విచారణను రేపటికి వాయిదా వేసింది.
వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు(Murder Case)ను విచారించడానికి గాను కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి(Avinash Reddy)ని సీబీఐ(CBI) పలుమార్లు విచారించింది. ఇంకా తమకు అనుమానాలున్న దృష్ట్యా సీబీఐ ఎదుట హాజరు కావాలని అవినాష్‌రెడ్డికి ఇటీవల సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న అవినాష్‌రెడ్డి పలు కారణాలు చెబుతూ విచారణకు గైర్హాజరయ్యారు.
సీబీఐ తనను అరెస్టు చేసే అవకాశముందని తనకు ముందస్తు బెయిల్(Anticipatory bail ) మంజూరు చేయాలని అవినాష్‌రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించారు. కోర్టు నిరాకరించడంతో అవినాష్ న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని ఈనెల 25న విచారణ చేపట్టి ఉత్వర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆదేశించింది. దీంతో గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి రేపటికి వాయిదా వేసింది.