అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ఇద్దరు మృతి చెందగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. అల్లూరి జిల్లా అంగళూరు వద్ద గండిపోచమ్మ ఆలయానికి( Gandi Pochamma Temple) వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా పాలకొల్లుకు చెందిన 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి నిమ్మల రామ్మోహన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రత్యేక వాహనాల్లో క్షతగాత్రులను పాలకొల్లు పంపాలని సూచించారు.