అమరావతి : వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) పై శనివారం టీడీపీ( TDP) శ్రేణులు దాడికి ( Attack ) యత్నించారు. కర్రలు,రాడ్లతో గుంటూరు రోడ్లపై హంగామా సృష్టించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చేసిన ఆరోపణపై విచారణ జరిపిన సీబీఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. దీంతో తిరుమల లడ్డూపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ వైసీపీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా వేంకటేశ్వరస్వామి ఆలయాల వద్ద పాప ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించింది .
ఈ కార్యక్రమానికి అంబటి రాంబాబు గుంటూరులోని గోరంట్లకు కారులో వెళ్తుండగా మార్గ మధ్యలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఒకరిద్దరూ టీడీపీ శ్రేణులు కారుపై చేతితో బాదారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా దాడి యత్నాన్ని ఆపలేకపోయారు. చివరకు పోలీసు బందోబస్తు మధ్య అంబటిని అక్కడి నుంచి బలవంతంగా పంపించి వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మూకలు రాష్ట్రంలో అరచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అంటూ ప్రశ్నించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కర్రలు రాడ్లు పట్టుకుని తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.