అమరావతి : విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం రామవరంలో నిర్వహిస్తున్న కోడిపందెం (Cock fighting camp) శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు (Police) దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 8 కోళ్లు, 20 కోడి కత్తులు, రూ. 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కోడిపందెం నిర్వహణకు సంబంధించి పలువురి పాత్రపై విచారణ కొనసాగుతోందని పోలీసులు వివరించారు. సంక్రాంతి పండుగ ( Sankranthi Festival ) సమయాల్లో కోడి పందెలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఎక్కడైనా కోడిపందెలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.