అమరావతి : వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) పై టీడీపీ నాయకుల దాడి పట్ల ఏపీ హైకోర్టు ( High Court ) సీరియస్ అయ్యింది . అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్ను కోర్టు విచారించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు అంబటి కుటుంబానికి 24 గంటలు భద్రత ఇవ్వాలని ఆదేశించింది.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని పేర్కొంటూ టీడీపీ నాయకులు గుంటూరు జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు నెలకొల్పారు. ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ అంబటి ఫ్లెక్సీలు ఉన్న చోటుకు కారులో బయలు దేరారు. ప్లెక్సీల వద్ద అప్పటికే టీడీపీ నాయకులు కర్రలు చేతపట్టుకుని ఉండడంతో పోలీసులు అంబటిని అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ దశంలో అంబటి రాంబాబు చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబటి నివాసం దాడి చేసి ఇంటి అద్దాలను, కిటికిలను , కార్లను ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పంటించారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.