అమరావతి : కర్నూలు జిల్లా బనగానపల్లెలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై అబ్బాస్ అనే యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాలిక ఈ విషయాన్ని ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.