అమరావతి : ఏపీలోని కాకినాడ(Kakinada ) జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాజులూరను మండలం శలపాకలో రాత్రి రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో (Clashes ) ముగ్గురు మరణించారు. ఈ ఘర్షణలో కత్తులతో దాడులకు దిగడంతో బత్తుల రమేష్, బత్తుల చిన్ని, బత్తుల రాజు మృతి చెందగా, బత్తుల శ్రీనుకు తీవ్రగాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.
మహిళ విషయంలో తలెత్తిన వివాదం హత్యలకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసులను మోహరించారు. గొల్లపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.