అమరావతి : కాకినాడ జిల్లాలో జంట హత్యలు (Double murders) కలకలం సృష్టిస్తున్నాయి. జిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో బుధవారం మహిళ, పురుషుడు దారుణ హత్యకు గురయ్యారు. అడ్డువచ్చిన మహిళా తల్లిపై సైతం దాడి చేయడంతో ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది.
గ్రామానికి చెందిన పెండ్యాల లోవమ్మ అనే మహిళ గత కొన్నేళ్లుగా నాగబాబు అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఇటీవల ఆమె శ్రీను అనే వ్యక్తి దగ్గర కావడాన్ని నాగబాబు భరించలేక బెండతోటలో కాయలు కోస్తుండగా లోవమ్మ, శ్రీనుపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డువచ్చిన లోవమ్మ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఘటన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో గాయపడ్డ రామలక్ష్మిని కాకినాడ జీజీహెచ్లో చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.