హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48 ఏండ్ల వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చాడు. అతని నుంచి శాంపిళ్లను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
యూకే నుంచి అనంతపురం వచ్చిన 51 ఏండ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ తేలింది. వీరిద్దరి కుటుంబ సభ్యులకు ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి విదేశాల నుంచి 67 మంది వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాల నుంచి వచ్చినవారిలో 12 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు పేర్కొంది.