అమరావతి : కాకినాడ జిల్లా తుని( Tuni ) లో తమ బిడ్డ కనిపించడం లేదని తల్లిదండ్రులు గత 13 రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉంటే ఓ జ్యోతిష్యుడి ( Astrologer ) అక్కడికి చేరుకుని తీవ్ర హల్చల్ చేశాడు.
తాను తెలంగాణ గద్వాల్ నుంచి వచ్చినట్లు ఆ జ్యోతిష్యుడు పరిచయం చేసుకుని చిన్నారి జ్ఞానేశ్వరి త్వరలో తిరిగి వస్తుందని ఆశ కలిగిస్తూ ఒకసారి, పాప భూదేవతలో ఉందని మరోసారి భయపెట్టేలా చేసిన మాటలతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
రాత్రంతా జ్యోతిష్యుడు వద్దన్నా ఇంటి డాబాపై పడుకోవడం భయందోళనకు గురయ్యామని చిన్నారి తల్లి మీడియాకు వివరించింది. నిలదీసిన వారికి సీఎం పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారని స్థానికులు వెల్లడించారు.
ఈ నెల 6న మధ్యాహ్నం చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి ముందు నుంచి కొంత దూరం వెళ్లిన దృశ్యం ఇంటి వద్ద అమర్చిన సీసీ కెమెరాల్లో నమోదయ్యింది . చిన్నారితో పాటు పెంపుడు కుక్క కూడా మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చింది.
చిన్నారి అదృశ్యంపై అప్పటికే పోలీసులు సమీప ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. కుక్కకు అమర్చిన ట్రాకర్ ద్వారా చిన్నారి ఆచూకి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు కుక్క ఆహారం తీసుకోక పోవడం వల్ల మరణించడంతో పోలీసులకు చిన్నారి ఆచూకి మరింత కష్టమైంది. అప్పటి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున బలగాలతో గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటి వరకు జ్ఞానేశ్వరి జాడ తెలియరాలేదు.
కాకినాడ చిన్నారి అదృశ్యం కేసులో జ్యోతిష్యుడు హల్చల్
తెలంగాణ నుండి వచ్చానని, పూజలు చేస్తే పాప తిరిగి వస్తుందని అర్ధరాత్రి చిన్నారి ఇంటిపైన పడుకున్న జ్యోతిష్యుడు
నిలదీసిన వారికి సీఎం పేరు చెప్పి బెదిరింపులు
పాప భూదేవిలో కలిసిపోయింది, నేను పూజలు చేస్తే నడుస్తూ వస్తుందని చెప్పి… https://t.co/hBwseGgrNb pic.twitter.com/RXOhDg97aH
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2026