APPSC | ఏపీలోని 21 ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రెండు విడుతలుగా పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది.
తొలి విడతలో వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రెండో విడతలో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న మొత్తం 890 పోస్టులకు సంబంధించి గతంలో 21 నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను తాజాగా ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు పరీక్షల వివరాలను తమ వెబ్సైట్లో ఉంచింది.
ఈ 21 ఉద్యోగ నోటిఫికేషన్లలో 18 ప్రకటనలకు సంబంధించి విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో నిర్వహిస్తారు. మిగతా పరీక్షలు ఉమ్మడి 13 జిల్లాల్లో నిర్వహించనున్నారు.

Appsc1

Appsc2

Appsc3