New SPs | మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం.. పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేశ్ బాలాజీ
New SPs | ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం, తిరుపతి , పల్నాడు జిల్లా లకు ఎస్పీలను నియమించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల(SPs) ను నియమించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమీ శాలి(Gautami Shali ) , తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్(Harshavardhan) , పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్ (Malika Garg) ను నియమించారు. అదే విధంగా పల్నాడు జిల్లా కలెక్టర్ (Palnadu Collector )గా శ్రీకేష్ బాలాజీ (Srikesh Balaji ) ని నియమించారు.
ఈనెల 13న జరిగిన పోలింగ్ రోజు, తరువాత జరిగిన మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనలపై వెంటనే స్వయంగా వచ్చి నివేదికలను అందజేయాలని ఆదేశించిన మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ ఢిల్లీకి వెళ్లి నివేదికను అందజేశారు. సీఈసీ ఆదేశాల మేరకు పల్నాడు కలెక్టర్‌ను, మూడు జిల్లాల ఎస్పీలను బదిలీ చేయడంతో ఖాళీ అయిన పోస్టులలో కొత్తవారిని నియమించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

