ఓటీటీ హిట్ – ఒక జీవితం.. ఎన్నో మలుపులు!
వెండితెర హిస్టరీలో మిస్టరీ చిత్రాలెన్నో కనిపిస్తాయి. ‘మూకీ’తో మొదలైన ఈ జోనర్ సినిమాలు.. ఓటీటీల వరకు ‘ఉత్కంఠ’భరితమైన ప్రయాణం సాగిస్తున్నాయి.
బాలన్: ద బాయ్
జీ5: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: ఆదిశేషన్ కేఆర్, ఫర్జానా పాలథింగల్, డాలీ జున్, జీన్ పాల్లాల్, గిరిష్ ఏడీ, బీనా ఆంటోని, టొవినో థామస్ (అతిథి పాత్ర), తదితరులు
దర్శకత్వం: చిదంబరం
వెండితెర హిస్టరీలో మిస్టరీ చిత్రాలెన్నో కనిపిస్తాయి. ‘మూకీ’తో మొదలైన ఈ జోనర్ సినిమాలు.. ఓటీటీల వరకు ‘ఉత్కంఠ’భరితమైన ప్రయాణం సాగిస్తున్నాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే.. చూసేవారిని కేవలం ప్రేక్షకులుగానే ఉంచకుండా.. కథలో భాగస్వాములుగా మార్చేస్తాయి. ‘తర్వాత ఏం జరుగుతుంది?’ అనే తీవ్రమైన కుతూహలం రేపుతాయి. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తాయి. తాజాగా, జీ5 వేదికగా స్ట్రీమింగ్కు వచ్చిన ‘బాలన్: ద బాయ్’ కూడా అలాంటి ఓ థ్రిల్లర్ సినిమానే!
మలయాళంలో హిట్‌టాక్ తెచ్చుకొని.. తెలుగు ప్రేక్షకులనూ ఫిదా చేసేస్తున్నది. మహిళా నేరస్తులు శిక్ష అనుభవించే జైలు గోడల మధ్య.. ‘బాలన్’ కథ మొదలవుతుంది. ఆ జైల్లో ఒక మహిళ (ఫర్జానా) శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. అక్కడే ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ పిల్లాడే ‘బాలన్’ (ఆదిశేషన్). తల్లితోపాటే జైల్లో పెరుగుతాడు. వేశ్య వృత్తిని కొనసాగించే షమ్నత (బీనా ఆంటోని) కూడా అదే జైల్లో ఉంటుంది.
జైలు నుంచి విడుదలైన వారిని వేశ్య వృత్తిలోకి దింపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా.. బాలన్ తల్లి విడుదలయ్యే సమయంలో.. ఆమెను కూడా ఆ వృత్తిలోకి దింపడానికి ప్రయత్నిస్తుంది. కానీ, బాలన్ తల్లి మాత్రం తాను ఎవరన్నదీ, ఎక్కడి నుంచి వచ్చిందన్నదీ ఈ ప్రపంచానికి తెలియకూడదని భావిస్తుంది. మారుపేర్లతో వివిధ ప్రాంతాల్లో పనులు చేయడం ప్రారంభిస్తుంది.
ఎవరి మీదైనా సందేహం వస్తే.. వెంటనే మకాం మార్చేస్తుంది. వేరే ఊరిలో, వేరే పేరుతో బతుకుతుంది. అలా ఊరికి దూరంగా ఉండే ఓ ఇంట్లో.. ఒంటరిగా ఉంటున్న 70 ఏళ్ల పెద్దావిడ (డాలీ జున్) దగ్గర కేర్ టేకర్‌గా చేరుతుంది. ఆ పెద్దావిడ కొడుకు లండన్‌లో ఉంటాడు. నెలకి ఒకసారి ఫోన్ చేస్తుంటాడు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ పెద్దావిడ.. తన కొడుకుతో మాట్లాడదు.
ఈ క్రమంలో బాలన్ తల్లి గురించి అర్థం చేసుకున్న పెద్దావిడ.. ఆ తల్లీకొడుకులకు భరోసా ఇస్తుంది. ఎక్కడికీ పారిపోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతుంది. ఇక అంతా మంచే జరుగుతుందనుకున్న సమయంలో.. ఆ ఒంటరి తల్లి జీవితం ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. వృద్ధాప్య సమస్యలతో బామ్మ చనిపోతుంది. ఆ విషయాన్ని లండన్‌లో ఉన్న ఆమె కొడుకు దగ్గర దాచిపెట్టి.. అదే ఇంట్లో జీవనం సాగిస్తుంది బాలన్ తల్లి.
మరోవైపు జైలు నుంచి విడుదలైన షమ్నత.. బాలన్ తల్లిని వెతుక్కుంటూ వస్తుంది. ఈ క్రమంలో షమ్నత ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న బాలన్ తల్లి.. ఏం చేస్తుంది? స్కూల్‌కి వెళ్లిన బాలన్ తిరిగొచ్చేసరికి.. తన తల్లి ఎందుకు కనిపించలేదు? ఆమెను చేరుకోవడానికి ఆ బాలుడు ఏం చేస్తాడు? అసలు బాలన్ తల్లి గతం ఏంటి? మారుపేర్లతో ఎందుకు రహస్య జీవితాన్ని కొనసాగిస్తుంది? తల్లితో విడిపోయిన తర్వాత బాలన్ పరిస్థితి ఏమిటి? తల్లిని వెతకడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? తల్లి ఆచూకీ కోసం ఎవరెవర్ని కలిశాడు? అతని జీవితంలో అబ్బాస్ (టొవినో థామస్) పాత్ర ఏమిటి? చివరికి తల్లి, కొడుకు కలిశారా? లేదా? అనే సవాలక్ష ప్రశ్నలకు సమాధానమే.. బాలన్: ద బాయ్ కథ!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

