అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 17 నెలలకు ప్రముఖ ఆలయాలకు నూతన చైర్మన్లను నియమించారు. ముఖ్యంగా శ్రీశైలం మల్లన్న(Srisailam Mallanna temple) ఆలయ చైర్మన్గా రమేష్ నాయుడును (Ramesh Naidu ) ప్రభుత్వం నియమించింది.
శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా కొట్టె సాయిప్రసాద్, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ చైర్మన్గా సురేంద్రబాబు , విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ చైర్మన్గా రాధాకృష్ణను, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్గా వెంకట్రాజు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.