హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): 2027లో నిర్వహించబోయే పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను సోమవారం ఆయన ప్రత్యేకంగా కలిసి.. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.
అనంతరం నిమ్మల మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల అనంతరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తానని కేంద్ర మంత్రి వెల్లడించారని వివరించారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యమిస్తున్నదని, పనులు అతివేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.