నేటి నుంచి ఏపీ టెట్-2022 హాల్టిక్కెట్లు జారీ
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష-ఏపీ టెట్ హాల్టికెట్లు ఇవాల్టి నుంచి విడుదలకానున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్...
అమరావతి: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష-ఏపీ టెట్ హాల్టికెట్లు ఇవాల్టి నుంచి విడుదలకానున్నాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cse.ap.gov.in/ లేదా https://aptet.apcfss.in/ వెబ్సైట్ నుంచి నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే.. జులై 26 నుంచి మాక్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ మాక్ పరీక్షలకు హాజరుకావొచ్చు.
ఏపీ టెట్ పేపర్-2 ఏ అర్హతల్లో మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్నా పేపర్-2ఏకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఒక్కసారికి మాత్రమే సడలింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులున్నా బీఈడీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అర్హత కల్పిస్తున్నది. అందుకని టెట్ రాసేందుకు 45 శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో రిజర్వేషన్ క్యాటగిరీ అభ్యర్థులు నష్టపోతున్నందున ఈ మార్పు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20 శాతం వెయిటేజీ కూడా ఉన్నదిది. అభ్యర్థులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1 (ఏ, బీ), 6-8 తరగతుల బోధనకు పేపర్-2 (ఏ, బీ) లో అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా, టెట్ ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరణ జూన్ 16 నుంచి ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

