AP TET Hall Tickets | ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. శనివారం రాత్రి నుంచి ఈ హాల్ టికెట్లను విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి రెండు సెషన్లలో 18 రోజుల పాటు టెట్ రాత పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
– ముందుగా అభ్యర్థులు టెట్ అధికారిక వెబ్సైట్ https://aptet.apcfss.in/ను సందర్శించాలి.
– హోం పేజిలో కనిపించే హాల్ టికెట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.అప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది.
– అందులో క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను ఇవ్వడంతో పాటు సరైన వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి.
– వివరాల నమోదు తర్వాత లాగిన్‌పై క్లిక్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది. అప్పుడు హాల్ టికెట్‌ను ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవడం సాధ్యమవుతుంది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ టెట్ రాత పరీక్ష కోసం మొత్తం 4,27,300 మంది అభ్యర్తులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,82,609 మంది అభ్యర్థులు పేపర్ 1ఏ సెకండరీ గ్రేడ్ టీచర్ కేటగిరీ పోస్టులకు.. 2,662 మంది 1బీ సెకండరీ గ్రెడ్ టీచర్.. 64,036 మంది అభ్యర్థులు పేపర్ 2ఏ లాంగ్వేజ్ కోసం.. 1,04,788 మంది అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.