AP Assembly | ఏపీలో ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ), పీయూసీ, అంచనాల కమిటీ ( పీఈసీ ), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)లకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో కమిటీలకు ఎన్నికైన సభ్యుల వివరాలను ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.
పీఏసీ సభ్యులుగా నక్కా ఆనంద్ బాబు, అరిమిల్లి అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, జయనాగేశ్వర్ రెడ్డి, లలితకుమారి, శ్రీరాం రాజగోపాల్, పులపర్తి రామాంజనేయులు, విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
అంచనాల కమిటీ సభ్యులుగా అఖిలప్రియ, బండారు నిమ్మక జయకృష్ణ, వేగుళ్ల జోగేశ్వరరావు, కందుల నారాయణ రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, పార్థసారధి, సునీల్‌కుమార్, ఏలూరు సాంబశివరావు ఎన్నికయ్యారని స్పీకర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలో సభ్యులుగా ఆనందరావు, ఈశ్వర్రావు, గిడ్డి సత్యనారాయణ, గౌతు శిరీష, కూనరవికుమార్, కుమార్ రాజా, బేబీనాయనా, తెనాలి శ్రావణ్, వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికైనట్లు స్పీకర్ వెల్లడించారు.