Mudragada Padmanabham : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కన్నుమూశారు. కొన్ని నెలలుగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న ముద్రగడ మంగళవారం సాయంత్రం ప్రాణాలు విడిచారు. హైదరాబాద్ సింధు ఆస్పత్రిలో శ్వాసకోస సమస్యకు చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో ముద్రగడ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఏపీలో విషాదం నెలకొంది.
కాపు ఉద్యమంతో ప్రసిద్ధి చెందిన ముద్రగడ పద్మనాభం ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 73 ఏళ్ల వయసులో అందర్నీ విషాదంలో ముంచుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ.. తండ్రి వీర రాఘవరావు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. వీర రాఘవరావు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా.. 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ముద్రగడ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన మంత్రిగా సేవలందించారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి pic.twitter.com/iomkryHFIx
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2026
సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కొన్నాళ్లు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలోనూ పనిచేసిన ముద్రగడ 2024 ఏపీ ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన ముద్రగడ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని లేదంటే తన పేరు చివర రెడ్డిని చేర్చుకుంటానని శపథం చేశారు. కానీ, పవన్ విజయంతో మాటకు కట్టుబడి తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారు ఆయన.