అమరావతి : భారత మహిళా క్రికెటర్ ( Cricketer ) శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా అందజేసింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి ( Nallapureddy Sri Charani ) కి బుధవారం ఏపీ మంత్రి నారా లోకేష్ ( Minister Nara Lokesh ) రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేశారు.
దీంతో పాటు విశాఖలో 5 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ కార్యక్రమం లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాఫ్ చైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ పూర్తయిన తరువాత గ్రూప్ వన్ ఉద్యోగం కల్పిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 2025 మహిళల ప్రపంచకప్‌లో తాను వేసిన బౌలింగ్‌లో 14 వికెట్లు తీసింది. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టు రన్స్ చేయకుండా అడ్డుకుని సత్తా చాటింది.