వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కన్వెన్షన్లోఎ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెవిలియన్ ప్రారంభమైంది. 17 వ ఆటా మహాసభలు వాషింగ్టన్ డీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. అనేక మంది రాజకీయ నాయకులు, కళాకారుల సమక్షంలో ఆటా వేడుకలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమెరికాలో స్థిరపడిన తెలుగువారు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకునేందుకు వీలుగా ఈ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు.
ఆటా 17వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు వాషింగ్టన్ డీసీలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు రత్నాకర్ పండుకాయల, హరి ప్రసాద్ లింగాల, మేడపాటి వెంకట్ ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఆటా కన్వెన్షన్ యువజన సదస్సులో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో వైఎస్సా అభిమానులు, వైసీపీ నాయకులు హాజరై ఆయనకు నివాళులర్పించారు. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాదరావు.. మహానేత వైఎస్సార్ సేవలను, స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.