అమరావతి : కర్ణాటకలో రెండు హెచ్ఎంపీవీ ( HMPV-హ్యూమన్ మెటాన్యుమో వైరస్) కేసులు వెలుగు చూడడంతో ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వైరస్‌పై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Sathya Kumar) తెలిపారు.
వైరస్ పట్ల రాష్ట్రానికి ఏ ప్రమాదం లేదని ఐసీఎంఆర్ఏ (ICMRA ) స్పష్టం చేసిందన్నారు. కొత్త వైరస్‌పై అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతం మీడియాతో మాట్లాడారు. నిరంతం నాలుగురోజులుగా సమీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని జిల్లాలో వైద్య సిబ్బంది అలెర్ట్ చేశామని పేర్కొన్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు.
వైద్య అధికారుతో బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. ముందస్తు జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైరస్ వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మందులను పీసీఆర్ టెస్టులు , మల్టీఫ్లెక్స్, యూనిఫ్లెక్స్ టెస్టులు చేయవలసిన అవసరముంటుందని, వాటిని అందుబాటలో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కర్ణాటక, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దగ్గరునుంచి పరిశీలిస్తున్నామని తెలిపారు. HMPV cases,