AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ముగిసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు విధించిన గడువు ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. చివరిరోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడాయి.
AP News : ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ముగిసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు విధించిన గడువు ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. చివరిరోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు అభ్యర్థులు, వారి మద్దతుదారులతో కిటకిటలాడాయి.
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కార్యాలయ ప్రాంగణాల్లోకి చేరిన వారందరికీ అధికారులు టోకెన్లు జారీచేసి, వారి నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో పురపోరు రసవత్తరంగా మారనుంది. ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీకి ఊహించని పరిణామం ఎదురైంది.
గడువు ముగియడంతో దాదాపు 25 మంది వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. సమయానికి కార్యాలయానికి చేరుకోలేకపోవడంతో వారు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది. నామినేషన్ల పర్వం ముగియడంతో ఎన్నికల సంఘం తదుపరి ప్రక్రియపై దృష్టి సారించింది. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అక్టోబర్ 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.
ఉపసంహరణల గడువు ముగిసిన తర్వాత బరిలో నిలిచే తుది అభ్యర్థులపై స్పష్టత రానుంది. అక్టోబర్ 28న పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

