AP Minister Roja | ఎమ్మెల్యే కాదు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు..పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
AP News | రాష్ట్రంలో 30వేల మంది మహిళలు మాయమయ్యారని దీనికి వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan)చేసిన వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర దుమారం రేపుతుంది.
అమరావతి : రాష్ట్రంలో 30వేల మంది మహిళలు మాయమయ్యారని దీనికి వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను వాలంటీర్లు అక్రమరవాణా చేస్తున్నారని ఆరోపించడం దారుణమని అన్నారు. వాలంటీర్ల గురించి తెలియని పవన్ కల్యాణ్ రాజకీయ స్వార్థం కోసం ఇష్టారీతిన వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తి వాలంటీర్ల వ్యవస్థల గురించి తెలుసుకోకుండా అనాలోచిత ఆరోపణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వెంటనే వాలంటీర్లను క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీలో 15వేల పైచిలుకు గ్రామ పంచాయతీలుంటే రెండు లక్షల 60వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. వీరిలో సగం మంది మహిళా వాలంటీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
కొవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. రాజకీయం, ప్యాకేజీల కోసం మీ మదర్‌ను, ఫ్యామిలీని జనసేన నాయకులను తిట్టిన వారిని వెనకేసుకు రావడం అతడికే చెల్లిందని విమర్శించారు. వారాహి అనే అమ్మవారి పేరిట చేపట్టిన వాహనంపై చెప్పులు వేసుకుని, ఇష్టారీతిన ప్రత్యర్థులను తిట్టడం శోచనీయమని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఎవరితో పెట్టుకున్నా చంద్రబాబును సీఎంగా చేయలేవని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌ను తిట్టే అర్హత పవన్‌కు లేదని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి తెలుసుకోకుండా అజ్ఞానిలో పవన్ మాట్లాడుతున్నాడని మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకు పడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి అబాసు పాలవుతున్నాడని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

