అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నారు. గత నెల 25న తీవ్రమైన దగ్గు రావడంతో నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందారు. 2021 జనవరి 1న చల్లా భగీరథ రెడ్డి తండ్రి ఎమ్మెల్సీ చల్లారామకృష్ణారెడ్డి కరోనాతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆయన స్థానంలో కొడుకు భగీరథరెడ్డికి అవకాశం కల్పించడంతో గత మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరుఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.