శ్రీశైలం: శ్రీశైలం (Srisailam) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఈవో పెద్దిరాజు, ఏఈఓ శ్రీనివాసరావు అర్చక వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జునుడి దర్శన ఏర్పాట్లు చేవారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ పండితుల ఆయనకు వేదాశీర్వచనం చేశారు. అధికారులు శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదం, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో
ఏఈవోలు హరిదాస్, శ్రీనివాస రావు, ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న, మల్లికార్జున్ రెడ్డి, ఏపీఆర్ఓ శివారెడ్డి, ఉభయ దేవాలయాల అర్చక వేద పండితులు, శ్రీశైలం సీఐ ప్రసాద్ రావు పాల్గొన్నారు.

