విజయనగరం: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి (Minister Sandhya Rani) పెనుప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మంత్రి సంధ్యారాణి విజయనగరం జిల్లా మెంటాడ మండలం పర్యటనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రామభద్రపురంలో ఆరికతోట వద్ద మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం టైరు ఒక్కసారిగా పేలిపోయింది. అదుపుతప్పిన కారు.. ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది.
దీంతో ఇద్దరు భద్రతా సిబ్బందితోపాటు, వ్యాన్‌లో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదానికి గురైన వాహనం వెనుకే మంత్రి ప్రయాణిస్తున్న కారు ఉన్నది. ఈ ప్రమాదం నుంచి సంధ్యారాణి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మంత్రి సంధ్యారాణి దగ్గరుండి ప్రమాదంలో గాయపడినవారిని అంబులెన్స్‌లో ఎక్కించి దవాఖానకు తరలించారు.