అమరావతి: బీజేపీ నేతలు చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వంపై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పెరిగిన మద్యం ధరల గురించి కాకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆ పార్టీ నేతలు బాధపడాలన్నారు. ఎరువుల రేట్లు అధికమవుతున్నా బాధలేదా అని ప్రశ్నించారు. ఎక్కడ్నుంచో పిలుపు వస్తే.. ఇక్కడ సభ పెడతారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై వారికి దృష్టి లేదని, ఆ పార్టీ తలపెట్టిన ప్రజాగ్రహ సభలో పెట్రోల్, డీజీల్ రేట్లపై మాట్లాడాలని హితవు పలికారు.