Nara Lokesh | ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ అండగా నిలబడుతున్నారు. గల్ప్ దేశాల్లో తాము పడుతున్న ఇబ్బందుల గురించి తన దృష్టికి రావడంతో వెంట వెంటనే తనకు వీలైనంత సాయం చేస్తున్నారు. వారిని నరకం నుంచి బయటపడేసి ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సౌదీకి వెళ్లి కష్టాలు పడుతున్న హసీనా అనే మహిళను బాసటగా నిలిచారు.
అన్నమయ్య జిల్లాకు మదనపల్లి తాలుకా నిమ్మనపల్లి గ్రామానికి చెందిన హాసీనా (25) మహిళకు ఇద్దరు కొడుకులు. ఆర్థికంగా చితికిపోయి ఉండటంతో కుటుంబానికి ఎంతో కొంత సాయంగా నిలబడాలని హసీనా సౌదీకి వెళ్లింది. కానీ అక్కడ ఇంటి పనుల కోసం తీసుకెళ్లి నానా చాకిరీ చేయిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా పనిచేయించుకుంటూ టార్చర్ చూపిస్తున్నారు. దీంతో తనకు ఇండియా రావాలని ఉందంటూ తన ఆవేదనను మొత్తం ఓ సెల్ఫీ వీడియోలో తెలియజేసింది.
‘ నేను సౌదీలో ఉన్నాను. నాకు ఇక్కడ చాలా టార్చర్ చూపిస్తున్నారు. పొద్దున రాత్రి తేడా లేకుండా పనిచేయిస్తున్నారు. సౌకర్యాలు సరిగ్గా ఇవ్వట్లేదు. తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు. ఏదో నాలుగు రూపాయలు సంపాదించాలని బయటకు వచ్చా. కానీ ఇక్కడ చూస్తే చాలా టార్చర్‌గా ఉంది. చాలా అంటే చాలా నరకం చూపిస్తున్నారు. నాకు బతకాలని లేదు.. చచ్చిపోవాలని అనిపిస్తుంది. మీరే ఏదైనా చేసి నన్ను ఇండియాకు తీసుకురండి.. మీకు దండం పెడతా.. ఇక్కడ మనుషుల్ని సరిగ్గా పట్టించుకోరు. ఎలా పడితే అలా మాట్లాడతారు. కోప్పడతారు. ఇక్కడ టార్చర్‌గా ఉంది.. నాకు ఇండియా రావాలని ఉంది.. నా పిల్లలను చూడాలని ఉంది. ‘ అని హసీనా ఓ వీడియోను పంపించింది. హసీనా గల్ఫ్ కష్టాలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆమెను ఇండియాకు తిరిగి రప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Please look into it @naralokesh Garu..
సౌదీ కి వెళ్లిన ఆమె పేరు : హసీనా
బోడిమల్ల గారి పల్లి, నిమ్మనపల్లి గ్రామం, మదనపల్లి తాలూకా
సౌదీలో ఉన్న ఆమె ఫోన్ నెంబర్ 8309730133 ( age 25)
ఆమె భర్త పేరు : హసన్ వలి (9985482968)
వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు..#AndhraPradesh pic.twitter.com/2zYeVfJtUc— Koushik Dammalapati (@OmDammalapati) August 5, 2024