హైకోర్టు తీర్పుపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..
minister botsa| ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక
అమరావతి: ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని కోర్టు తెలిపింది. శాసనసభకు లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని, శాసన అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదని తీర్పు నిచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ సీఎం జగన్తో సమావేశం అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
హైకోర్టు తీర్పు మేం ఊహించిందేనని, తీర్పులో కొత్తదనం ఏమీ లేదని పేర్కొన్నారు. చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయని, శాసనసభలో చట్టాలు చేయకూడదంటే ఎలా అని అన్నారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో తెలియదని, తీర్పు పూర్తిగా చదివాక అన్ని విషయాలపై మాట్లాడతామని అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటుకు ఈ క్షణం వరకు కట్టుబడి ఉన్నామని మరోమారు స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ చేయాలనేది తమ ప్రభుత్వ ఉద్ధేశమని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదే తమ విధానమన్నారు.
త్వరలో మూడు రాజధానుల బిల్లులు పెడతామని వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలో లేదో చర్చించి చెబుతామని, మూడు నెలల్లో ప్లాట్లు ఇవ్వాలంటే సాధ్యమా లేదా చూడాలని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

