Kollu Ravindra | తన వ్యక్తిగత భద్రతను తగ్గించారని మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించడం పట్ల ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి తరహాలో సెక్యూరిటీ ఉండదని సెటైర్ వేశారు. సీఎం, పీఎం తరహాలో ఒక ఎమ్మెల్యేకు భద్రత ఉండదని ఎద్దేవా చేశారు. అమరావతిలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే.. గద్దలా వాలడానికి వస్తున్నాడని విమర్శించారు.
రాబందులా ఐదేళ్లు రాష్ట్రాన్ని పీక్కు తిన్న జగన్ అండ్ కో.. చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. పాపాలు చేసిన వారిని ఎక్కడున్నా వెతుక్కొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
జగన్ పిచ్చికి తగ్గట్టు తమ బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. సుపరిపాలన కోసం వాట్సాప్ గ్రూప్లు పెట్టమనడాన్ని పేర్ని నాని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నానినే దాచి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేశారు.