Ambati Rambabu | ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీడీపీ-జనసేన మధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చేసుకున్న ఒప్పందాన్ని పట్టించుకోకుండా టీడీపీ అధినేత చంద్రబాబు.. సొంతంగా అభ్యర్థులను ప్రకటించడం పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దుబాటుకు ముందే అభ్యర్థులను ప్రకటించడం సరికాదని సూచించారు. ఇది పొత్తు ధర్మం కాదని పరోక్షంగా హెచ్చరించారు. టీడీపీ రెండు సీట్లను సొంతంగా ప్రకటించింది కాబట్టి.. దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ కూడా రెండు సీట్లు ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీచేస్తుందని వెల్లడించారు.
ఇంతవరకు సాఫ్ట్‌గా ఉన్న జనసేనాని ఇలా ఒక్కసారి టీడీపీకి పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. పొత్తు ధర్మమే కాదు.. ఏ ధర్మం పాటించని వాడే చంద్రబాబు అని అంబటి రాంబాబు అని సెటైర్ వేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఈ మేరకు అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు.
పొత్తు ధర్మమే కాదు
ఏ ధర్మము పాటించని వాడే “బాబు”
తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్!@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 26, 2024