AP Minister Acchannaidu | రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కే అచ్నెన్నాయుడు చెప్పారు. ప్రకృతి విపత్తులు, తుఫానులతో దెబ్బ తిన్న ధాన్యం కూడా తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. వ్యవసాయంపై చర్చకు వచ్చేందుకు ధైర్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. గతంలో ధాన్యం సేకరించి, రైతులకు డబ్బు చెల్లించే పరిస్థితి లేదని ఆరోపించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.