ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక ఆధారాలు బయటపడ్డాయి. ఈ కేసులో నిందితుడైన వెంకటేశ్ నాయుడు (ఏ34) నోట్ల కట్టల్ని లెక్కిస్తున్న వీడియో బయటకొచ్చింది. ఇతను కీలక నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.
ఇటీవల హైదరాబాద్ శివారులోని శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్‌హౌస్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించిన సిట్ అధికారులు రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా లీకైన వీడియో చూస్తుంటే ఈ డబ్బు కూడా లిక్కర్ స్కామ్‌కు సంబంధించిందేనని అనుమానిస్తున్నారు. హవాలా రూపంలో అందిన నగదును వెంకటేశ్ నాయుడు, అతని స్నేహితులు లెక్కించి అట్టపెట్టెలో పెట్టడం ఆ వీడియోలో కనిపిస్తుంది. అందులో రూ.500, రూ.100 నోట్ల కట్టలతో పాటు రెండు వేల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి. దీన్నిబట్టి ఈ వీడియో 2021 నాటిదని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ డబ్బును అప్పట్లో ఎక్కడికి తరలించారు? ఎవరికి చేర్చారనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. శంషాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో స్వాధీనం చేసుకున్న రూ.11కోట్ల కట్టలను విడిగా ఉంచాలని, వాటిని ఇతర నోట్లతో కలపవద్దని సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టు శనివారం ఆదేశించింది. సిట్ అధికారులు కొత్త నోట్లను తీసుకొచ్చి సీజ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఏ1 రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
SIT Finds Crore of rupees Cash Video on Liquor Scam accused Venkatesh Naidu’s Phone
The Special Investigation Team (SIT) has recovered a video from the mobile phone of Ex MLA Chevireddy Bhaskar Reddy’s associate Venkatesh Naidu, showing him counting crore of rupees in… pic.twitter.com/o22MVdrsOx
— Sudhakar Udumula (@sudhakarudumula) August 2, 2025