AP Inter Exams Schedule | ఏపీలోని 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్, ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. తొలి రోజు లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయి. ఇక జనవరి 23వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి.
ఫిబ్రవరి 23న లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష
ఫిబ్రవరి 25న ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష
ఫిబ్రవరి 27న హిస్టరీ పేపర్ 1 పరీక్ష
మార్చి 2న మ్యాథ్స్ పేపర్ 1 పరీక్ష
మార్చి 5న జువాలాజీ / మ్యాథ్స్ 1బి పరీక్ష
మార్చి 7న ఎకనామిక్స్ 1 పరీక్ష
మార్చి 10న ఫిజిక్స్ 1 పరీక్ష
మార్చి 12న కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1 పరీక్ష
మార్చి 14న సివిక్స్ 1 పరీక్ష
మార్చి 17న కెమిస్ట్రీ 1 పరీక్ష
మార్చి 20న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1 పరీక్ష
మార్చి 24న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 1 పరీక్ష
ఫిబ్రవరి 24న లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష
ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్ 2 పరీక్ష
ఫిబ్రవరి 28న హిస్టరీ / బోటనీ పేపర్ 2 పరీక్ష
మార్చి 3న మ్యాథ్స్ పేపర్ 2 ఎ / సివిక్స్ 2 పరీక్ష
మార్చి 6న జువాలాజీ 2 / ఎకనామిక్స్ 2 పరీక్ష
మార్చి 9న మ్యాథ్స్ పేపర్ 2 బి పరీక్ష
మార్చి 11న ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2 పరీక్ష
మార్చి 13న ఫిజిక్స్ 2 పరీక్ష
మార్చి 16న మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ 2 పరీక్ష
మార్చి 18న కెమిస్ట్రీ 2 పరీక్ష
మార్చి 23న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 2 పరీక్ష