IAS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్‌ను తిరిగి నియమించింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న శ్యామలరావును సాధారణ పరిపాలన విభాగం ( జీఏడీ) ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. అలాగే పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబును నియమించారు. మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా సౌరభ్ గౌర్, ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనా, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్‌ను బదిలీచేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్ నియమించారు. అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను బదిలీ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్‌ను నియమించారు.