Mithun Reddy | వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తనపై అక్రమ కేసులు బనాయించారని.. మిథున్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. మిథున్ రెడ్డితో పాటు మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు పర్యటన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఫిర్యాదుతో మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదైయ్యాయి. ఈ క్రమంలో మిథున్ రెడ్డి, రెడ్డప్పలపై సెక్షన్ 307తో పాటు పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.