అమరావతి : మచిలీపట్నం రేషన్ బియ్యం ( Ration rice) మాయం కేసులో వైసీపీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్నినానికి (Perninani) ఏపీ హైకోర్టులో (AP High Court) ఊరట లభించింది. నానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్( Counter) దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశిస్తూ తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
రేషన్ బియ్యం మాయం కేసులో మంగళవారం బందరు తాలుకా పోలీసులు పేర్నినాని ఏ6 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. అతడిని ఏ క్షణంమైనా అరెస్టు చేయవచ్చని పుకార్లు రావడంతో ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్‌లో ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం పేర్నినానికి ఊరట కలిగించింది.
ఇప్పటికే రైస్ గోదాం నుంచి మాయమైన బియ్యం కేసులో పేర్నినాని భార్య జయసుధను ఏ1 కేసు నమోదు చేయగా ఆమె కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు కూడా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురిని నిన్న రాత్రి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల పాటు రిమాండ్ (Accused Remand) విధించింది. నిందితులుగా ఉన్న మేనేజర్ మానస తేజ్‌ను, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్రాన ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావుకు రిమాండ్ విధించారు.