అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court ) మరో ముగ్గురు కొత్త జడ్జిలను(Judges) నియమకానికి రాష్ట్రపతి (President) ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి చేసిన సిఫారసు మేరకు హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిలను నియమించింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్న చల్లా గుణరంజన్(Gunaranjan), కుంచం మహేశ్వరరావు(Maheshwarrao), తూట చంద్ర ధనశేఖర్(Dhanashekar) ను అదనపు జడ్జిలుగా నియమించారు.
రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తరువాత ముగ్గురిని అదనపు జడ్జిలుగా నియమించామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ‘ఎక్స్’ వేదిక ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 26 మంది ఉండగా కొత్తగా ముగ్గురు నియామకంతో కలిపి ఈ సంఖ్య 29కు చేరుకుంది.