అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ముఖ్యమంత్రికి పోర్టుపై చిత్తశుద్ధి లేదని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం వద్ద నిధులు కూడా లేవని, 10 శాతం భూసేకరణ కూడా జరపలేదని విమర్శించారు.
పోర్టును కేంద్రమే నిర్మిస్తామంటే సీఎం జగన్ ఎందుకు నాన్‌మేజర్ ప్రాజెక్టుగా నోటిఫై చేశారని ప్రశ్నించారు. కడప స్టీల్‌ప్లాంట్ ఎంవోయును గోప్యంగా ఉంచింది నిజం కాదా అని అన్నారు.